బండ్ల గణేశ్ మరో రాంగోపాల్ వర్మలా తయారవుతున్నాడేమిటి?

September 14, 2022
img

ఒకప్పుడు సినిమాలలో కమెడియన్‌ వేషాలు వేసుకొనే బండ్ల గణేశ్ ఇండస్ట్రీలో పెద్దపెద్ద హీరోలతో సినిమాలు నిర్మించేంత డబ్బు ఎలా సంపాదించాడో, ఎలా బడా నిర్మాతగా మారాడో నేటికీ ఎవరికీ తెలీదు. ఆయన వెనక విజయనగరానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయనాయకుడున్నాడని, ఆయన బినామీగా బండ్ల గణేశ్ సినిమాలు తీస్తుంటాడని నేటికీ గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. అది వేరే సంగతి. 

ఎప్పుడూ మీడియా ఫోకస్‌లో ఉండాలని కోరుకొనే బండ్ల గణేశ్, తరచూ ఏవో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ, ఎవరినో వేలెత్తి చూపుతూ మళ్ళీ తన మీద ఈగ వాలకుండా పవన్‌ కళ్యాణ్‌ భజన చేస్తూ జాగ్రత్తపడుతుంటాడు. 

తాజాగా నటులు అడివి శేష్, జొన్నలగడ్డ సిద్ధూ ఇద్దరూ సోమవారం రాత్రి ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజరైనప్పుడు వారు తమకు సౌకర్యంగా ఉండేలా సోఫాలలో కూర్చోన్నారు. వారి ఆ ఫోటోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, పక్కనే పవన్‌ కళ్యాణ్‌ చేతులు కట్టుకొని కూర్చొన్న మరో ఫోటోను పోస్ట్ చేసి, “నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి..ఆచరించండి.. అది మన ధర్మం అంటూ @ పవన్‌ కళ్యాణ్‌ అని వ్రాసి దణ్ణం పెడుతున్న ఓ ఇమోజీని పోస్ట్ చేశాడు. 

ఎవరైనా తప్పుగా మాట్లాడితే స్పందించవచ్చు లేదా ఓ సినిమా లేదా రాజకీయ అంశాలపై తన అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. కానీ ఒకరు కూర్చోన్న విదానాన్ని కూడా తప్పు పడుతూ దానిని కూడా పవన్‌ కళ్యాణ్‌తో ముడిపెడుతూ బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ని అడ్డుపెట్టుకొని బండ్ల గణేశ్ ఇటువంటి కామెంట్స్ చేస్తుండటంతో అభిమానులు కూడా ఏమనాలో తెలియక తలలు పట్టుకొంటున్నారు. ఇప్పటికే ఓ రాంగోపాల్ వర్మతో వేగలేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మరొకడు తయారయ్యాడని నెటిజన్స్ జోకులు వేస్తున్నారు.           

Related Post