బాహుబలి యానిమేషన్ సినిమా ట్రైలర్‌ త్వరలో: రాజమౌళి

May 01, 2024


img

దర్శకుడు రాజమౌళి తన అభిమానులకు, దేశ ప్రజలకు ఊహించని విదంగా ఓ కానుక ఇవ్వబోతున్నారు. అదే... బాహుబలి యానిమేషన్ సినిమా. ‘బాహుబలి, క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరు తీసిన ఈ యానిమేషన్ సినిమా ట్రైలర్‌ త్వరలో విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటిస్తూ దాని ఫస్ట్ గ్లిమ్స్‌ కూడా విడుదల చేశారు.

‘మాహిష్మతి ప్రజలు బాహుబలి పేరుని మంత్రంలా జపిస్తున్నప్పుడు ఈ విశ్వంలో ఏ శక్తి అతను తిరిగి రాకుండా అడ్డుకోలేదు,’ అంటూ చిన్న లైన్ కూడా ఇచ్చారు. 

రాజమౌళి సినిమాలంటే కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది. రాజమౌళి మహేష్‌ బాబు హీరోగా ఓ సినిమా చేయబోతున్నారని అందరికీ తెలుసు. కనుక ఆయన ఆ హడావుడిలోనే ఉన్నారని అందరూ భావిస్తున్నారు. కానీ చడీచప్పుడూ లేకుండా ఈ యానిమేషన్ సినిమా పూర్తి చేసి ఉరుము లేని పిడుగులా త్వరలో ట్రైలర్‌ రిలీజ్ అంటూ రాజమౌళి ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారనే చెప్పొచ్చు.

‘బాహుబలి, క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సినిమాకు సంబందించి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష