ముఫాసా, ది లయన్ కింగ్ ట్రైలర్‌... ఓ మధురానుభూతి రీవైండ్

April 30, 2024


img

1994లో విడుదలైన యానిమేషన్ సినిమా ‘ది లయన్ కింగ్’ చూడని వారుండరు. నేటి యువతరానికి, నడివయస్కులు, వృద్ధులు అందరికీ కూడా లయన్ కింగ్ ఓ మాధురానుభూతి. ఆ చిన్ననాటి మధురానుభూతిని మరోసారి రీవైండ్ చేస్తూ ‘ముఫాసా, ది లయన్ కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే, నాటి ‘లయన్ కింగ్’ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఇంకా అద్భుతంగా తీసిన్నట్లు స్పష్టమవుతుంది. లయన్ కింగ్ తర్వాత చాలా చాలా కార్టూన్, యానిమేషన్ సినిమాలు వచ్చాయి. వాటిలో అనేకం ప్రపంచవ్యాప్తంగా చిన్నాపెద్దా తేడా లేకుండా అలరించాయి కూడా కానీ లయన్ కింగ్ స్థానాన్ని లయన్ కింగే భర్తీ చేయగలదని ట్రైలర్‌ నిరూపిస్తోంది. 

ది లయన్ కింగ్ కధ ఆధారంగా దర్శకుడు బేరీ జెన్‌కిన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే: జెఫ్ నాధన్‌సన్, సంగీతం: హాన్స్ జిమ్మర్, ఫార్రెల్ విలియమ్స్, లిన్-మాన్యుఏల్మీరాన్ద, నికోలస్ బ్రిటేల్, మార్క్ మాన్సీనా, కెమెరా: జేమ్స్ లాక్స్‌టన్, ఎడిటింగ్: జోయ్ మెక్ మిలన్ చేస్తున్నారు. 

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాల్ట్ డిస్నీ పిక్చర్స్, పాస్టెల్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎడిల్ రోమాస్కీ, మార్క్ సెర్యార్క్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.      
Related Post

సినిమా స‌మీక్ష