దుబాయ్‌లో అల్లు అర్జున్‌ విగ్రహం... పక్కనే అల్లు అర్జున్‌ ఫోటో!

March 29, 2024


img

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ ఒక్కసారిగా ప్రపంచదేశాలలో చాలా పాపులర్ అయిపోయారు. ఇందుకు నిదర్శనంగా ప్రఖ్యాత మాడమ్ తుస్సాడ్స్ (దుబాయ్‌) మ్యూజియంలో అల్లు అర్జున్‌ మైనంతో తయారు చేసిన అల్లు అర్జున్‌ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని చెప్పుకోవచ్చు. 

ఈరోజు దాని ఆవిష్కరణకు అల్లు అర్జున్‌ అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ విగ్రహానికి వేసినటువంటిదే ఎర్రసూట్ ధరించి దాని పక్కనే నిలబడి పుష్పా స్టైల్లో ఫోటో దిగారు. 

తమ అభిమాన హీరో అల్లు అర్జున్‌కి అంత గౌరవం లభించడం, ఆ విగ్రహం పక్కనే నిలబడి అల్లు అర్జున్‌ ఫోటో దిగడం చూసి అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. 

పుష్ప-2 నిర్మాతలలో ఒకరైన శరత్ చంద్ర నాయుడు ఈ విషయాన్ని ఈరోజు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకొన్నప్పుడు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఇంకా సంతోషం కలిగిస్తుంది. పుష్ప-2 టీజర్‌ ఎప్పుడు అన్నా? అడిగితే ‘అన్న పుట్టినరోజుకు తప్పకుండా.. ఫిక్స్’ అని చెప్పేశారు. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు అంటే ఏప్రిల్‌ 8న టీజర్‌ విడుదల కాబోతోందన్న మాట!    


Related Post

సినిమా స‌మీక్ష