బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ ట్రైలర్‌ రిలీజ్

May 02, 2024


img

రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానాలతో సహా ఆ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు నిచ్చింది. ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ యానిమేషన్ రూపంలో ‘క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఆ సినిమా ప్రకటనే అందరినీ ఆశ్చర్యపరిస్తే, ఆ ప్రకటన వెలువడిన రెండు మూడు రోజులలో ఆ సినిమా ట్రైలర్‌ కూడా విడుదల చేయడం ఇంకా విశేషం. 

అయితే ఈ యానిమేషన్ సినిమా ట్రైలర్‌ ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్‌లో విడుదల చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి డిస్నీ+ హాట్ స్టార్‌ ఓటీటీలో ఈ సినిమా ప్రసారం కాబోతోంది. 

బాహుబలి సినిమాని చూసిన తర్వాత యానిమేషన్ సినిమానా అని దీనిని తక్కువ అంచనా వేసే అవకాశం లేకుండా దీనిని కూడా చాలా అద్భుతంగా తీశారు. ముఖ్యంగా పిల్లలను ఈ యానిమేషన్ సినిమా చాలా ఆకట్టుకుంటుంది.


Related Post

సినిమా స‌మీక్ష