కల్కి ఎడి2898 యానిమేషన్ క్యారక్టర్స్ వచ్చేస్తున్నాయి!

April 06, 2024


img

సినిమా ప్రచారం (ప్రమోషన్స్)లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వస్తున్న కల్కి ఎడి2898 సినిమా ప్రమోషన్స్‌లో మరో కొత్త ట్రెండ్ ప్రారంభించారు.

ఇదివరకు కల్కిని పరిచయం చేస్తున్నప్పుడు గ్రహాంతరవాసుల వేషధారణలో చేసిన ప్రమోషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అదే సమయంలో సినిమాకు సంబందించి కొన్ని కార్టూన్ పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఈసారి సినిమా ప్రమోషన్స్ కోసం సినిమాలో ప్రధాన పాత్రలు చేస్తున్న ప్రభాస్‌, దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో సహా పది మంది నటీనటుల యానిమేషన్ క్యారక్టర్స్ సిద్దం చేసి వాటితో సినిమా థియేటర్లలో, టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.      

రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి. అశ్వినీ దత్ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా జనవరి 12న విడుదల చేస్తామని ప్రకటించారు కానీ చేయలేకపోయారు. మే 9వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఆ సమయంలోనే లోక్‌సభ, ఏపీ శాసనసభ ఎన్నికల హడావుడి ఉంటుంది కనుక మే నెలాఖరుకి వాయిదా పడే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష