సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘భరతవర్ష’ నుంచి ‘అమ్మ కదిలివచ్చే..’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదలైంది. కళ్యాణ చక్రవర్తి వ్రాసిన ఈ పాటకు అనుదీప్ దేవరకొండ సంగీతం అందించగా, స్కంద వేలువల్లి మనసులను తాకేలా అద్భుతంగా ఆలపించారు.
ఈ పీరియాడికల్ మూవీలో గోపీ చంద్కు జోడీగా రీతూవర్మ నటిస్తున్నారు. వినోద్ కుమార్, గావీ చాహల్, తణికెళ్ల భరణి, రాకేష్ వర్రే, భారత్ రెడ్డి, ఛత్రపతి శేఖర్, రవి వర్మ, కిషోర్, కార్తికేయ, మధుమణి, బేబీ తేజల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
భరత వర్షకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: సంకల్ప్ రెడ్డి, పాటలు: చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి
సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, స్టంట్స్: వెంకట్, పృధ్వి, రియల్ సతీష్, రాజేష్ లంకా, వెంకటరావు, ఎడిటింగ్: చోటా కె ప్రసాద్ చేస్తున్నారు.
సిల్వర్ స్ర్కీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.