మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకరవర ప్రసాద్ గారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి చాలా సందడి చేశారు.
వెంకటేష్, చిరంజీవి కలిసి చేసిన పాటని ప్లే చేస్తున్నప్పుడు వేదిక దిగువన ప్రేక్షకులతో కలిసి కూర్చున్న వెంకటేష్, అనిల్ రావిపూడి కుర్చీలలో నుంచి లేచి హుషారుగా డాన్స్ చేస్తుంటే, చిరంజీవి కూర్చునే డాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. వారు ముగ్గురి డాన్స్ చూసి అభిమానులు కూడా హుషారుగా డాన్స్ చేశారు.
ఈ సినిమాలో వెంకటేష్ కేవలం అతిధి పాత్ర చేస్తేనే ఇంత గొప్పగా ఉందని, అభిమానులు ఇంత సంతోషంగా ఉన్నారని కనుక తామిద్దరం కలిసి అనిల్ రావిపూడితో ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేసేందుకు సిద్ధమని చిరంజీవి వేదికపైనే ప్రకటించారు. తమ కోసం మంచి కధ సిద్ధం చేయమని అనిల్ రావిపూడిని కోరారు.
వెంకటేష్ కూడా ఈ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ సినిమా చేసేందుకు రెడీ అని చెప్పేశారు. కనుక 2027 సంక్రాంతికి ముగ్గురూ కలిసి మరో సినిమాతో వచ్చేయవచ్చు.
‘మన శంకరవర ప్రసాద్ గారు’ లో క్యాథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ‘మన శంకరవర ప్రసాద్ గారు’ ఈ నెల 12న సంక్రాంతి పండగకి ముందు విడుదల కాబోతోంది.
#HookStep B C Centers Out of Control 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #ManaShankarVaraPrasadGaru pic.twitter.com/M27REUHlc9