దృశ్యం-3 రిలీజ్‌ డేట్

January 08, 2026


img

మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా ప్రధానపాత్రలు చేసిన దృశ్యం-మొదటి భాగం 2013లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. దానిని తెలుగు, హిందీతో సహా పలు భాషల్లో రీమేక్ చేస్తే అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ 2021లో విడుదలైన దాని సీక్వెల్ కూడా అలాగే అన్ని భాషల్లో రీమేక్ చేయగా సూపర్ హిట్ అయ్యింది. కనుక జీతూ జోసెఫ్ దృశ్యం-3ని కూడా సిద్దం చేశారు. కానీ ఎప్పుడు రిలీజ్ చేసేది చెప్పకపోవడంతో ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

ఈ సినిమాని ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు జీతూ జోసెఫ్ స్వయంగా చెప్పారు. ఎప్పటిలాగే ఇది కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.  తెలుగులో మళ్ళీ వెంకటేష్, మీనా జంటగా, హిందీ వెర్షన్‌లో అజయ్ దేవగన్, శ్రీయ నటిస్తున్నారు. హిందీ వెర్షన్ ఈ ఏడాది అక్టోబర్‌ 2న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/jYbEYF1t-hk?si=3I7kvRMpjPYJ25xr" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష