రెండేళ్ళకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఈ నెల28 నుంచి 31 వరకు జరుగుతుంది. ఈ జాతరకు హాజరయ్యి వనదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు వివిధ పార్టీల అధినేతలు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ కలిసి నేడు కేసీఆర్ ఫామ్‌హౌసుకి వెళ్ళి ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు.
కేసీఆర్ కూడా వారిని ఆప్యాయంగా పలకరించారు. కేసీఆర్ సతీమణి వారికి పసుపు, కుంకుమ, చీర, తాంబూలం ఇచ్చి అతిధి మర్యాదలు చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వారిరువురితో కాసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడారు. మంత్రులిరువురూ కూడా కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మేడారం మహాజాతరకు తప్పకుండా రావాలని ఆహ్వానించి తిరిగి వెళ్ళిపోయారు.