తెలుగు సినీ పరిశ్రమకు పక్కలో పాములా మారిన ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతనీపై సైబర్ క్రైమ్ పోలీసులు 5 వేర్వేరు కేసులు నమోదు చేశారు. వాటన్నటిలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు.
కానీ అతనికి విదేశీ పౌరసత్వం ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే విదేశాలకు పారిపోతాడని, కనుక బెయిల్ మంజూరు చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు తరపు న్యాయవాది వాదించారు. అతనిని ఇతర కేసులలో ఇంకా ప్రశ్నించాల్సి ఉందని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఆ 5 కేసుల్లో బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తున్నట్లు న్యాయస్థానం తేల్చి చెప్పింది. కనుక పోలీసులు మళ్ళీ అతనిని జైలుకి తరలించారు.
ఐ బొమ్మ రవి కేవలం సినిమా పైరసీ కేసుగా మాత్రమే చూడలేము. వాటితో అతను వందల కోట్లు వ్యాపారం కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. విదేశాల నుంచి ఈ ఆర్ధిక లావాదేవీలు నడిపించినంన ఈ కేసులో ఈడీ కూడా వేరేగా కేసులు నమోదు చేసి ప్రశ్నించే అవకాశం ఉంది.