తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు, అధికారుల వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయ నేతలకి నోటీసులు పంపించివాంగ్మూలాలు తీసుకుంటున్నారు.
ఇటీవలే ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ అధినేత ఆరా మస్తాన్, తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుల వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు నోటీస్ పంపారు. రేపు ఉదయం 10.30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. కనుక ఈ కేసులో కొండల్ రెడ్డి వాంగ్మూలం చాలా కీలకమే.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని బహిరంగంగానే చెప్పారు. కనుక త్వరలో ఆమెను రప్పించి వాంగ్మూలం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది.