నాగ చైతన్య అప్పుడప్పుడు హిట్స్ కొడుతూ ముందుకు సాగుతున్నారు కానీ అతని తమ్ముడు అఖిల్ మాత్రం ఇంతవరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోతున్నాడు. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాజాగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
ఈ సినిమా నుంచి నేడు ‘వారేవా వారేవా’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. అనంత శ్రీరాం వ్రాసిన ఈ పాటని తమన్ స్వరపరహ్చ్గా జుబిన్ నౌతియాల్, శ్వేత మోహన్ కలిసి పాడారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు, సంగీతం: తమన్, కెమెరా: లియాన్ బ్రిట్టో, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
మనం ఎంటర్‌ప్రైజస్, సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న లెనిన్ ఈ ఏడాది మే1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.