భారీ బడ్జెట్, భారీ అంచనాలతో నేడు విడుదలవుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నిన్న అర్దరాత్రి దాటిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అయితే పెంచిన ఛార్జీల ద్వార వచ్చే ఆదాయంలో 20శాతం ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఆదేశించింది.
నేటి నుంచి సోమవారం వరకు మూడు రోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై రూ.105, మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.132 పెంచుకునేందుకు అనుమతించింది.
ఈ నెల 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.62, మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.89 పెంచుకునేందుకు అనుమతించింది.
ఇక్కడ టికెట్ ఛార్జీలపై అయోమయం కొనసాగుతుండగానే విదేశాలలో రాజాసాబ్ బొమ్మ పడింది. కనుక అప్పుడే సినిమా రివ్యూలు కూడా వచ్చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో రొమాంటిక్ పాత్ర చేసి మెప్పించారు.