రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు శ్రవణ్ కుమార్‌కు నల్గొండ జిల్లా కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మిర్యాలగూడ పట్టణంలో నివసిస్తున్న పెరుమాళ్ళ ప్రణయ్, అదే ఊళ్ళో నివసిస్తున్న వైశ్య కుటుంబానికి చెందిన మారుతీ రావు కుమార్తె అమృతని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారి పెళ్ళిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె తండ్రి మారుతీ రావు కులాంతర వివాహం చేసుకున్నందుకు అల్లుడు పెరుమాళ్ళ ప్రణయ్‌ని 2018, సెప్టెంబర్‌లో 14న కిరాయి హంతకుల చేత హత్య చేయించాడు.
ఆ కేసులో కిరాయి హంతకుడు సుభాష్ శర్మకి న్యాయస్థానం ఉరిశిక్ష విధించి మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్‌తో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఆ కేసులో మారుతీరావు బెయిల్‌పై బయటకు వచ్చి 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హత్య కేసులోనే నిందితుడు శ్రవణ్ కుమార్‌కి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.