తెలంగాణ ప్రభుత్వం రామోజీ ఫిల్మ్ సిటీకి వంద కోట్లు పన్ను మాఫీ చేసింది. ఇక నుంచి ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థలకు కూడా పన్ను మినహాయింపు వర్తింపజెయబొతొన్దిఒ. రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరణకు అవసరమైన భూమి కేటాయించి, రాయితీలు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. నేడు రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డికి ఈనాడు గ్రూప్ ఎండీ కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రామోజీ ఫిల్మ్ సిటీ, విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్న ఈనాడు మీడియా రాష్ట్రానికే గర్వకారణం. రాష్ట్రాభివృద్ధిలో వాటి భాగస్వామ్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వాటికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పడుతుంది,” అని అన్నారు.
రామోజీ సంస్థలతో కాంగ్రెస్ , బిజేపి నాయకులకు సత్సంబంధాలున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో దాని పట్ల వ్యతిరేకత ఉంది. కనుక ఈ భారీ పన్ను రాయితీలపై ఏవిధంగా స్పందిస్తుందో?