మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ది రాజాసాబ్ రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్ వేసేందుకు నిర్మాణ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
అయితే టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ ఇంకా జీవో విడుదల చేయలేదు. కనుక జీవో వస్తే కానీ రాజాసాబ్ బుకింగ్స్ మొదలుపెట్టడం సాధ్యం కాదు.
ఒకవేళ ప్రభుత్వం అనుమతించకపోతే రేపు ఉదయం రాజాసాబ్ థియేటర్లలో విడుదల చేసుకోవలసి ఉంటుంది. తెలంగాణలో సాధారణ టికెట్ ఛార్జీలతోనే సినిమా ప్రదర్శించవలసి ఉంటుంది.
కనుక దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ తెలంగాణ ప్రభుత్వం జీవో కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు హైకోర్టు ఎటువంటి అభ్యంతరమూ చెప్పలేదు. కనుక మరికొద్ది సేపటిలో జీవో జారీ చేసే అవకాశం ఉంది.