జన నాయకుడికి హైకోర్టు లైన్ క్లియర్

January 09, 2026


img

విజయ్ దళపతి హీరోగా నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) సినిమా నేడు (శుక్రవారం) విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో రిలీజ్ అవలేదు. దీనిపై దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈరోజు ఉదయం తీర్పు చెప్పింది. ఈ సినిమాకి తక్షణమే యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డుని ఆదేశించింది. కనుక సంక్రాంతి పండుగకు జన నాయకుడు విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.  

కనుక ఈరోజు విడుదల కాకపోయినప్పటికీ సంక్రాంతి పండుగని సద్వినియోగం చేసుకోగలిగితే జన నాయకుడు ఒడ్డున పడతాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో సిద్దమైన ఈ సినిమాలో విజయ్‌, పూజా హెగ్డే, మమిత బైజు, ప్రకాష్ రాజు ముఖ్యపాత్రలు చేశారు.      



Related Post

సినిమా స‌మీక్ష