మా ఇంటి బంగారం టీజర్‌-ట్రైలర్‌ చూస్తా ఉండండి!

January 09, 2026


img

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్‌ లాంటి టీజర్‌ నేడు విడుదలయ్యింది.  

“మీరు చూస్తా ఉండండి... మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది,” అంటూ మొన్న ఓ పోస్టర్ పెట్టారు. సరే ఎలా కలిసిపోతుందోనని ట్రైలర్‌ లాంటి టీజర్‌ చూడబోతే పంటి కింద రాయిలా ఇంగ్లీషులో నరేషన్ ఇచ్చారు. కానీ టీజర్‌ మాత్రం అద్భుతంగా ఉంది.

కొత్తగా పెళ్ళయిన వధువు ఓ పెద్ద కుటుంబంలో ఒద్దికగా ఇమడటం చూపించి, హటాత్తుగా యాక్షన్ హీరోయిన్‌లా బస్సులో విలన్లతో ఫైట్ చేసి చితకొట్టేస్తున్నట్లు చూపారు. టీజర్‌ చాలా ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే ఇంగ్లీషులో నరేషన్ చాలా ఎబ్బెట్టుగా ఉంది.         

ఈ సినిమాకు కధ: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, దర్శకత్వం: నందినీ రెడ్డి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాష్, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: లీ విట్టకేర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.

ఈ సినిమాని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి కలిసి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష