రంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం నలుగురు యువకులు మృతి

January 08, 2026
img

ఈరోజు తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లలో మోకిల పరిధిలో మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు  యువకులు ఘటనా స్థలంలోనే చనిపోగా నక్షత్ర అనే యువతి తీవ్రంగా గాయపడింది. 

మృతులలో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీ విదార్దులు, మరొకరు ఎంజీఐటి విద్యార్ధి. మృతులు సూర్యతేజ (బీబీఏ-2వ సం.), సుమిత్ (బీబీఏ-3వ సం.), శ్రీనిఖిల్(బీబీఏ-3వ సం.), రోహిత్ (ఎంజీఐటి విద్యార్ధి) అని పోలీసులు గుర్తించారు. వారి సహ విద్యార్ధిని నక్షత్ర (బీబీఏ-3వ సం.)ను సమీపంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 

వీరందరూ మోకిల నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా దట్టమైన పొగ మంచులో వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. 

సంక్రాంతి పండుగకు ముందు జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయి, ఒకరు తీవ్రంగా గాయపడటంతో ఆ 5 కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.

Related Post