ఓం శాంతి నుంచి లిరికల్ వీడియో సాంగ్‌

January 08, 2026


img

నూతన దర్శకుడు ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతి’ నుంచి నేడు ‘ఓం శాంతి’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. భరద్వాజ్ వ్రాసిన ఈ పాటని జయ్ క్రిష్ సంగీతం అందించగా అభయ్ జోద్‌పూర్‌కార్యక్రమం పాడారు. 

ఈసినిమాలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అప్పాజీ), బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వి ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఏఆర్ సజీవ్, సంగీతం, జై క్రిష్, కెమెరా: దీపక్ యరగర, డైలాగ్స్: నంద కిషోర్ ఈమని, ఎడిటింగ్: కళ్యాణ్ సూర్య ప్రకాష్ చేశారు. 

ఎస్ ఒరిజినల్స్, మూవీ వేర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్‌, ఆదిత్య, వివేక్, అనూప్ చంద్రశేఖరన్, సాద్ధిక షేక్, నవీన్ శనివారపు కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష