మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’పై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. నేడు విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచింది.
సుమారు 3 నిమిషాల నిడివి గల ట్రైలర్‌లో నవీన్ పోలిశెట్టి ఫైట్స్ పక్కన పెడితే, “నీతో ప్రేమలో చాలా దూరం వెళ్ళిపోయాను చారూ... ఇప్పుడు యూట్యూబ్ టర్న్ తీసుకోమంటే... నా ప్రేమ కూకట్‌పల్లి ఫ్లై ఓవర్ లాంటిది. దానిలో యూటర్న్ లేదు,” అంటూ నవీన్ పోలిశెట్టి ఎంతో సీరియస్‌గా డైలాగ్స్ చెపుతుంటే ఎవరైనా నవ్వాపుకోగలరా?
ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేశారు.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన అనగనగా ఒక రాజు వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.