కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ వచ్చేసింది.
ట్రైలర్ మొదట్లోనే “ఇంతకాలం కర్రలు, కత్తులు, తుపాకులతో భీభత్సంగా ఫైట్స్ చేశాను. కనుక కొన్ని రోజులు వాటికి దూరంగా ఉండమని చెప్పాడు మా ఫ్యామిలీ డాక్టర్,” అంటూ రవితేజ అసలు విషయం చెప్పేశాడు. రవితేజ మాస్ మసాలా సినిమాలలో కూడా కామెడీ ఉంటుంది. కానీ అది ప్లేట్ మీల్స్ వంటిదైతే ఇది ఫుల్ మీల్స్ వంటిదని ట్రైలర్‌లోనే రుచి చూపించేశారు.
ఈ సినిమాలో వెన్నెల ప్రశాంత్ కిషోర్, సునీల్, సత్య, శుభలేఖ సుధాకర్, మురళీధర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కిషోర్ తిరుమల,సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: ఈ సందర్భంగా ప్రకాష్ చేస్తున్నారు. ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.