మా ఇంటి బంగారం కోసం మీరు చూస్తా ఉండండి: సమంత

January 07, 2026


img

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో మొదలుపెట్టిన ‘మా ఇంటి బంగారం’ అప్ డేట్ వచ్చింది. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు మా ఇంటి బంగారం ట్రైలర్‌ లాంటి టీజర్‌ విడుదల చేస్తామని తెలియజేశారు. 

“మీరు చూస్తా ఉండండి... మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది,” అంటూ ఓ ప్రైవేట్ బస్సులో నిలబడి ఉన్న సమంత పోస్టర్ ట్రాలాలా మూవీ పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానిలో రక్తమోడుతున్న రెండు తుపాకులు మద్యలో మంగళ సూత్రం ఉంది. అంటే మా ఇంటి బంగారం అనుకునే ఓ సాధారణ గృహిణి సమస్యలు ఎదురైతే ఏవిధంగా తిరగబడి పోరాడారో చూపబోతున్నారన్న మాట!   

ఈ సినిమాకు కధ: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, దర్శకత్వం: నందినీ రెడ్డి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాష్, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: లీ విట్టకేర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.

ఈ సినిమాని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి కలిసి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.         

సమంత, నందిని రెడ్డి కలిసి గతంలో చేసిన ‘ఓహ్ బేబీ’ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. కనుక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.           


Related Post

సినిమా స‌మీక్ష