గుంటూరులో వెంకీ-చిరు సాంగ్ లాంచ్ మరికొద్ది సేపటిలో

December 30, 2025


img

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకరవర ప్రసాద్ గారు’ జనవరి 12న సంక్రాంతి పండగకు వస్తున్నారని దర్శకత్వం అనిల్ రావిపూడి ముందే చెప్పారు. చెప్పినట్లుగా రెడీ చేసేశారు.

అంతేకాదు... నేడు బెజవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకున్న తర్వాత గుంటూరు వెళ్ళి  సంక్రాంతి సంబురాలు మొదలుపెట్టేశారు కూడా. 


స్థానిక యువతతో కలిసి సంక్రాంతి పిండివంటలు తయారీలో పాల్గొన్నారు. ఇలా కూడా సినిమా ప్రమోషన్స్ చేయవద్దని అనిల్ రావిపూడి నిరూపిస్తున్నారు.

ఇంతకీ గుంటూరులోనే ఈ హడావుడి దేనికంటే ఈరోజు సాయంత్రం నగరంలోని విజ్ఞాన్ కళాశాలలో వెంకీ-చిరు సాంగ్ లాంచ్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మొన్న విడుదల చేసిన ఈ పాట ప్రమో వైరల్ అవడంతో అభిమానులు ఈ పాట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కొద్దిసేపు ఓ అతిధి పాత్రలో కనిపిస్తారు. దానిలో భాగంగానే ఈ ‘మెగా విక్టరీ సాంగ్’కు ద్దరూ కలిసి డాన్స్ చేశారు.    

ఈ పాటని కాసర్ల శ్రీరాం వ్రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విజయ్ పోలక్కి కోరియోగ్రఫీ చేశారు.   

ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా క్యాథరిన్‌ చేస్తున్నారు. హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్‌ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026, జనవరి 12న సంక్రాంతి పండగకి ముందు విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష