అభిమానులతో ప్రభాస్.. ఎన్నాళ్ళకు!

December 28, 2025


img

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా అభిమానులకు అందుబాటులో ఉండేవారు ప్రభాస్. కానీ బాహుబలితో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయిన తర్వాత అనేక సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు ప్రజలకి దూరమైపోయారనే భావన నెలకొంది. దర్శకుడు మారుతి ఆ లోటుని తీర్చారు. రాజాసాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో ప్రభాస్‌ని తీసుకువచ్చి అభిమానుల ముందు నిలుచోబెట్టారు. ప్రభాస్ కూడా చాలా కాలం తర్వాత అభిమానులతో ముఖాముఖి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషించారు. ముఖ్యంగా ఇలాంటి ఎంటర్‌టెయినర్ సినిమా చేసి 15ఏళ్ళయిపోయిందన్నారు. 

“నేను వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేసుకుపోతుంటే, దర్శకుడు మారుతి నన్ను ఈ హర్రర్ కామెడీ ట్రాక్‌లోకి తీసుకువచ్చారు. మారుతి రైటింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, డార్లింగ్ ఈ క్లైమాక్స్ సీన్ నువ్వు పెన్నుతో రాశావా లేదా మెషిన్ గన్‌తో రాశావా? అని అడిగాను. రాజాసాబ్ మీ అంచనాలకు మించి ఉంటుందని చెప్పగలను. సంక్రాంతికి రాజాసాబ్‌తో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలు హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను,” అని ప్రభాస్ అన్నారు.  

రాజాసాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...      


Related Post

సినిమా స‌మీక్ష