నేడు వైకుంట ఏకాదశి సందర్భంగా ప్రముఖ నిర్మాత నాగ వంశీ కొత్త సినిమా ప్రకటన చేశారు. స్వరూప్ రాజ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా కొత్త సినిమాని ప్రకటిస్తూ ఓ చిన్న పల్లి, కొండపై దేవాలయం బొమ్మతో ఓ చక్కటి పోస్టర్ విడుదల చేశారు. కనుక గ్రామీణ నేపధ్యంతో వస్తున్న కధ అనుకుంటే చిత్రం మద్యలో ఏకే 47 మిషన్ గన్ బొమ్మని కూడా పెట్టి సినిమాలో మరేదో ఉంటుందని హింట్ ఇచ్చారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం స్వరూప్ ఆర్‌ఎస్‌జె చేస్తారు. సంక్రాంతి పండగ రోజున లేదా తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.