న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే జైలుకి పంపిస్తామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ బహిరంగ హెచ్చరించినా పబ్బుల్లో డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఈగల్ టీమ్ అకస్మాత్తుగా హైదరాబాద్‌లోని పలు పబ్బులలో సోదాలు నిర్వహించగా ‘క్వేక్ ఎరీనా’ పబ్బులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పబ్బులో ఉన్నవారిలో 14 మందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా వారిలో 8 మంది డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈగల్ టీమ్ పబ్బు యాజమాన్య,మ డ్రగ్స్ సేవించిన వారిపై కేసులు నమోదు చేసింది. పబ్బులో లభించిన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పబ్బులో గంజాయితో సహా మరో రెండు రకాల డ్రగ్స్ భారీగా పట్టుబడినట్లు తెలుస్తోంది.