ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్

December 30, 2025
img

సిద్ధిపేట జిల్లావాసులు, కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి భక్తుల చిరకాలవాంచ త్వరలో నెరవేరబోతోంది. రూ. 3 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జనవరి రెండో వారంలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది దసరా పండుగకే ఈ రైల్వే స్టేషన్‌ ప్రారంభం కావాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. 

తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కొమురవెల్లి మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇప్పుడు కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌, సికిందరాబాద్‌లతో పలు ప్రాంతాల నుంచి భక్తులు నేరుగా కొమురవెల్లి చేరుకొని మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకోగలుగుతారు. బిజేపి ఎంపీలు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకొని రైల్వేమంత్రితో మాట్లాడి కొమురవెల్లిలో రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేయించారు. కనుక వారి చేతుల మీదుగానే కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సం కావచ్చు. 

Related Post