నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. దీనిలో పెద్ద నిర్మాతలందరూ కలిసి ప్రోగ్రెసివ్ ప్యానల్ పేరుతో పోటీ చేయగా, చిన్న నిర్మాతలు మన ప్యానల్ పేరుతో పోటీ చేశారు. ఫిల్మ్ ఛాంబర్‌లో మొత్తం 3387 మంది సభ్యులున్నారు. వారిలో 1,417 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికలలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు, 12 మంది సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగిసింది. వెంటనే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలుపెట్టారు. మరికొద్ది సేపట్లో ఫలితాలు వెలువడతాయి. నేడు ఎన్నికలలో విజయం సాధించిన ప్యానల్ 2027 వరకు కొనసాగుతుంది.