శనివారం సాయంత్రం కూకట్‌పల్లిలో జరిగిన రాజాసాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో ప్రభాస్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి, మాళవిక మోహనన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రదర్శించిన ఓ ప్లేకార్డ్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.
దానిపై “నిధి పాపని పెళ్ళి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి?ఎంత ఆస్తి ఉండాలి? ఎలా ఉండాలి? అని వ్రాసి ఉంది. అది చూసి ప్రభాస్‌తో సహా వేదికపై ఉన్నవారందరూ హాయిగా నవ్వుకున్నారు.
అప్పుడు యాంకర్ సుమ అ ప్లకార్డులో వ్రాసున్నది చదివి వినిపించి నిధి అగర్వాల్‌ని జవాబు చెప్పమన్నారు. ఆ ప్రశ్న విని ఆమె కూడా నవ్వుకుంటూ “లవ్ ప్రొఫెషన్’లో ఉండాలని జవాబిచ్చారు.
ఇటీవల ఆమె హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు కొందరు ఆమెను అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టారు. ఆ ఘటనపై నటుడు శివాజీ దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మాట్లాడుతూ స్త్రీల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు నేటికీ చాలా దుమారం రేపుతూనే ఉన్నాయి.
అయితే నిన్న ఈ ప్రశ్నకు నిధి అగర్వాల్ సమాధానం చెప్పిన తర్వాత యాంకర్ సుమ “చీరలోనే నిధులన్నీ ఉన్నాయి” అన్నారు. మరి ఆమె చేసిన ఈ వ్యాఖ్యపై మళ్ళీ కొత్తగా వాదనలు మొదలవుతాయేమో?