మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ సోమవారం విడుదలైంది. మొదట చిన్న సినిమాగా మొదలు పెట్టినప్పటికీ పూర్తయ్యేసరికి పాన్ ఇండియా మూవీగా మారిపోయింది. నిన్న విడుదల చేసిన ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ట్రైలర్‌లో గ్రాఫిక్స్ సినిమాని మరోస్థాయికి చేర్చాయి. సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. అంత అద్భుతంగా ఉంది ట్రైలర్.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. జనవరి 9న సంక్రాంతి పండగకు ముందు రాజాసాబ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు.