హనీమూన్ కాదు... షూటింగ్‌ ముఖ్యం: సమంత

December 06, 2025


img

ఈ నెల 1న నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్ళి చేసుకున్నారు. కనుక ఇద్దరూ హనీమూన్‌కి విదేశాలకో వెళ్ళిపోతారని అందరూ అనుకున్నారు. కానీ సమంత పెళ్ళయిన 5వ రోజే అంటే నిన్న శుక్రవారమే సెట్స్‌లోకి వచ్చేశారు.

నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్ర చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో పాల్గొన్నారు. తర్వాత చిత్ర బృందంతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాల పట్ల ఆమె నిబద్దత చూసి అభిమానులు ప్రశంశలు కురిపిస్తున్నారు. 

సమంత సొంత సినీ నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.1గా తీసిన ‘శుభం’లో కూడా ఆమె ఓ ముఖ్యపాత్ర చేశారు. అది సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

సమంత, నందిని రెడ్డి కలిసి గతంలో చేసిన ఓహ్ బేబీ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. కనుక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 


Related Post

సినిమా స‌మీక్ష