ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న ‘శంభాల’ డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. ప్రతీ దానిని సైంటిఫిక్ కోణంలో చూసే హీరో, అతీంద్రియ శక్తులను కళ్ళార చూసినప్పుడు, దాని కారణంగా గ్రామంలో మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడు ఏవిదంగా ఆపుతాడనేది ఈ సినిమా కధ.. అని ఈరోజు విడుదలైన ట్రైలర్‌లో చెప్పేశారు.
ఈ సినిమాలో ఆదికి జోడీగా అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్వాశిక విజయ్, అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్, శివ కార్తీక్, శైలజ ప్రియ, చైత్ర, రామరాజు, రంగనాధం, శ్రావణ సంధ్య థియేటర్, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, శిజూ మీనన్ ముఖ్య పాత్రలు చేశారు.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: ప్రవీణ్ కె బంగారి, ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని, ఆర్ట్: జేకే మూర్తి, స్టంట్స్: రాజ్ కుమార్ చేస్తున్నారు. డిసెంబర్ 25న శంభాల విడుదల కాబోతోంది.