క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఘాటి’ ఈ నెల 11న విడుదల కావలసి ఉండగా అనివార్య కారణాల వలన వాయిదా వేస్తున్నట్లు యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసింది. సినిమా ఎప్పుడు విడుదల చేయబోతున్నారో త్వరలో తెలియజేస్తామని కూడా చెప్పలేదు. కనుక సినిమా రిలీజ్ బాగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
సుహాస్ హీరోగా ‘ఓ భామ అయ్యో రామ' మాత్రం జూలై 11 న విడుదల కాబోతోంది. ఇప్పుడు ఘాటి నుంచి పోటీ ఉండదు కనుక ‘ఓ భామ అయ్యో రామ'కి విజయావకాశాలు పెరిగినట్లే.
ఘాటి సినిమాకు కధ: చింతకింది శ్రీనివాసరావు, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్; కొరియోగ్రఫీ: రాజు సుందరం, కెమెరా: కాటసాని మనోజ్ రెడ్డి, ఆర్ట్: తోట తరణి, యాక్షన్: రామ్ కిషణ్, ఎడిటింగ్: వెంకటస్వామి నక్క, చాణక్య రెడ్డి తూరుపు అందిస్తున్నారు.
రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.
Offical note👍#Ghaati #AnushkaShetty https://t.co/zPtsgNwXpw pic.twitter.com/GiQjqfkUA2