ఓ భామ అయ్యో రామా.. ట్రైలర్‌

July 05, 2025


img

రామ్ గోదాల దర్శకత్వంలో సుహాస్, మాళవిక మనోజ్ జంటగా చేసిన ‘ఓ భామ అయ్యో రామా’ జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతున్నందున శనివారం ట్రైలర్‌ విడుదల చేశారు.

సుహాస్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో ఇటీవల విడుదలైన ‘ఉప్పు కప్పురంబు’ బోర్లా పడి అప్పుడే ఓటీటీ చేరుకుంది. అది ఓటీటీలో నుంచి మాయం అయ్యేలోగా సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ అనే ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌ర్‌తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ట్రైలర్‌ చూస్తే కామెడీ బాగానే ఉందనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో జూలై 11న విడుదలైతే తెలుస్తుంది.  

ఈ సినిమాలో అనిత హంస నందిని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృధ్వీరాజ్, ప్రభాస్‌ శ్రీను, రాఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నాయని పావని తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్‌ నల్లా, ప్రదీప్ తాళ్ళు కలిసి నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: మణికందన్, ఆర్ట్: బ్రహ్మ కడలి చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష