మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న చాలా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీని కోసం మోహన్ బాబు, మంచు విష్ణు సుమారు రూ.200 కోట్లు పైనే ఖర్చు చేశామన్నట్లు చెప్పారు. కానీ కన్నప్పకు మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు. భారత్‌లో రూ.30.14 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని మొత్తం రూ.55 కోట్లు (గ్రాస్) సాధించినట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు.
ఒకవేళ మొదటి వారంలోనే సినిమా టాక్, కలెక్షన్స్ సరిగాలేకపోతే రెండో వారానికి ఇంకా పడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే కన్నప్ప టీమ్ అధికారికంగా కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకటించాల్సి ఉంది.
కన్నప్ప సినిమా విడుదలకు ముందు మోహన్ బాబు ఇంట్లో మంచు విష్ణు, మనోజ్ మద్య గొడవలు, కేసులు కూడా ప్రేక్షకులపై ఎంతో కొంత ప్రభావం చూపే ఉంటాయి. అయితే కన్నప్పలో అనేక మంది హేమాహేమీలు ఉన్నప్పటికీ, ప్రభాస్ ఉండటం సినిమాకు ఎంతో కొంత కలిసి వచ్చిందని రిలీజ్ రోజు నుంచే టాక్ వినిపించింది.