తమిళ సినీ నటి వాసుకి అలియాస్ పాకిజాకు ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రూ.2 లక్షలు ఆర్ధిక సాయం అందించారు. గత మూడేళ్ళుగా సినిమా అవకాశాలు రాకపోవడంతో తిండికి కూడా డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతున్నానని కనుక ఆర్ధిక సాయం చేయాల్సిందిగా ఆమె సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్‌ని అభ్యర్ధించారు.
దానిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులను ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకొని హైదరాబాద్ రావలసిందిగా సూచించారు. వారు ఆమెతో ఫోన్లో మాట్లాడి హైదరాబాద్ రావలసిందిగా కోరగా ఆమె వచ్చారు. ఈరోజు ఉదయం జనసేన నేతలు ఆమె ఉంటున్న చోటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తరపున రూ.2 లక్షల విరాళం అందించారు.
ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ ఈ కష్టకాలంలో పిలవగానే దేవుడిలా వచ్చి ఆదుకున్న పవన్ కళ్యాణ్‌కి ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఇద్దరూ కూడా తనకి చాలా సాయం చేశారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆర్ధిక సాయం అందించి తనను ఆదుకున్నారంటూ ఆమె కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="te" dir="ltr">సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ <a href="https://twitter.com/PawanKalyan?ref_src=twsrc%5Etfw">@PawanKalyan</a> గారు 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం. <a href="https://t.co/YD2YYw1mO7">pic.twitter.com/YD2YYw1mO7</a></p>— JanaSena Party (@JanaSenaParty) <a href="https://twitter.com/JanaSenaParty/status/1939985561252773924?ref_src=twsrc%5Etfw">July 1, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>