కాబోయే వదినగారు మరిది సినిమాకి క్లాప్!

May 15, 2025


img

కాబోయే వదినగారు తన మరిది సినిమాకి క్లాప్ కొట్టారు. ఇంతకీ ఎవరంటారా? ఇంకెవరు విజయ్ దేవరకొండ ప్రియురాలు రష్మిక మందన. గురువారం హైదరాబాద్‌లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల కొత్త సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొని వారిపై ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టి లాంఛనంగా సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వెంకీ అట్లూరి, కళ్యాణ్ శంకర్, నటుడు శివాజీ తదితరులు హాజరయ్యారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆదిత్య హాసన్ దర్శకుడు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాత నాగ వంశీ చెప్పారు.   


Related Post

సినిమా స‌మీక్ష