అవును. నిజమే. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ళు జైలు శిక్ష పడటంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు గాలి కిరీటి తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా జూనియర్ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరో విశేషమేమిటంటే, ఈ సినిమాలో అతనికి జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. అలనాటి అందాల నటి జెనీలియా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాకు అందరూ హేమాహేమీలే పనిచేస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రాధాకృష్ణ రెడ్డి, డైలాగ్స్: కళ్యాణ చక్రవర్తి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కెకె సెంథిల్ కుమార్, స్టంట్స్: పీటర్ హెయిన్స్, వెంకట్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి శివాని సమర్పణలో వంశీ శేఖర్, హరీష్ అరసు కలిసి తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. జూలై 18న జూనియర్ గాలి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.