శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో ‘కుబేర’ నుంచి ‘పోయిరా పోయిరా మామ..’ అంటూ సాగే మొదటి పాట ప్రమో విడుదలైంది. ఈ మాస్ బీట్ సాంగ్, దానికి ధనుష్ చేసిన గ్రూప్ డాన్స్ చూసినప్పుడు ఇది శేఖర్ కమ్ముల సినిమా కుబేర నుంచేనా కాదా? అని అభిమానులకు అనుమానం కలగవచ్చు. కానీ పాట ప్రమో చూసి సినిమాని అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. కనుక జూన్ 20న సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడక తప్పదు.
పోయిరా పోయిరా మామ అంటూ సాగే భాస్కర భట్ల వ్రాసిన ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ పాటని ధనుష్ పాడారు. పూర్తిపాట ఈ నెల 20న విడుదలవుతుంది.
ఈ సినిమాలో నాగార్జున కోటీశ్వరుడైన వ్యాపారవేత్తగా నటిస్తుండగా ధనుష్ బిచ్చగాడిగా నటించారు. కుబేరలో రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. జూన్ 20న కుబేరా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.