అప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లోకి మట్కా

November 30, 2024


img

కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా చేసిన మట్కా పీరియాడికల్ మూవీ నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో  విడుదలైన మట్కాకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాధరణ లభించకపోవడం మట్కా బృందానికి చాలా నిరాశ కలిగించే విషయమే.

ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్‌ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీసిన సినిమాకు ఇటువంటి చేదు అనుభవం ఎదురవడం చాలా బాధాకరమే.

కధేమిటంటే, చిన్న తనంలోనే హత్య చేసి జైలుకి వెళ్ళిన వాసు (వరుణ్ తేజ్)ని జైలర్ నారాయణ మూర్తి  (రవిశంకర్) తన అవసరాల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తాడు. వాసు జైలు నుంచి విడుదలయ్యాక వైజాగ్ పూర్ణా మార్కెట్‌లో కొబ్బరికాయల వ్యాపారి అప్పలరెడ్డి (అజయ్ ఘోష్) వద్ద పనిలో చేరుతాడు. అక్కడ ఓ రౌడీ గ్యాంగ్‌తో గొడవపడి వారి ప్రత్యర్ధి గ్యాంగ్ లీడర్ నానిబాబు (కిషోర్)కి దగ్గరవుతాడు. ఆ తర్వాత వాసు జీవితం ఎలా మలుపులు తిరిగింది? మట్కా ఆటలోకి ఎలా ప్రవేశించాడు? అనేది కధ. 

వాసు ‘మట్కా కింగ్’గా మారుతున్న క్రమం నుంచి క్లైమాక్స్ వరకు యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింభించే విధంగా సెట్స్, దుస్తులు, మేకప్, సంగీతం, కెమెరా పనితనం అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. ఆనాడు మట్కా ఎంతో పాపులర్ అయ్యింది కానీ అదే కధని సినిమాగా తీస్తే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 


Related Post

సినిమా స‌మీక్ష