గాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్‌

April 27, 2024


img

గామి సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్‌ దానికి పూర్తి భిన్నమైన యాక్షన్ చిత్రం ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శనివారం సాయంత్రం ఈ సినిమా టీజర్‌ విడుదలైంది.

ఈ కధ 1960లలో గోదావరి జిల్లాలలో జరిగినట్లు చూపారు. ఓ గ్రామంలో వారందరూ హీరోని చంపేందుకు ప్రయత్నిస్తుంటే వారిని హీరో ఏవిదంగా ఎదుర్కొన్నాడు? అసలు వారు అతనిని ఎందుకు చంపాలనుకున్నారు? వారిని ఎదుర్కొంటూ హీరో అసామాన్య స్థాయికి ఏవిదంగా ఎదిగాడనేది ఈ సినిమా కధ అని తెలుస్తోంది. ఊహించిన్నట్లే టీజర్‌లో విశ్వక్ సేన్‌ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. 

ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి ఓ ప్రధాన పాత్ర చేస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి సీతార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మదాడి, ఆర్ట్: గాంధీ నడికుండికర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. ఈ సినిమా మే 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష