కాజల్ ని వదిలిపెట్టని తేజ..!

June 17, 2019


img

తెలుగు పరిశ్రమకు చందమమ కాజల్ ను పరిచయం చేశాడు డైరక్టర్ తేజ. లక్ష్మి కళ్యాణం సినిమాతో కాజల్ ను తెచ్చిన ఈయన చాలా గ్యాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఆమెను తీసుకున్నాడు. ఆ సినిమా కాజల్ కు తేజకు మంచి హిట్ ఇచ్చింది. ఇక ఈమధ్యనే సీత అంటూ కాజల్ లీడ్ రోల్ తో మరో ప్రయత్నం చేశాడు తేజ. అయితే ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. 

ప్రస్తుతం తేజ మరో లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని తెలుస్తుంది. ఈ సినిమా కూడా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నాడట. కాజల్ తో తేజ వరుసగా హ్యాట్రిక్ మూవీ ఇదవుతుంది. తను సినిమా చేసేందుకు మిగతా హీరోయిన్స్ ఎవరు దొరకట్లేదా లేకపోతే మరే కారణమో తెలియదు కాని కాజల్ తో తేజ ఇలా వరుస సినిమాలు చేయడం మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష