హమ్మయ్య హోర్మూజ్ గేట్లు తెరుచుకుంటాయట!

May 24, 2026


img

అమెరికా-ఇరాన్‌ యుద్ధం ప్రభావం వలన భారత్‌తో సహా యావత్ ప్రపంచ దేశాలలో గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడింది. కానీ త్వరలో హోర్మూజ్ జలసంధిని అన్ని దేశాల నౌకలకు రెండు నెలల పాటు తెరువబోతున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ శాంతి చర్చలు దాదాపు కొలిక్కి రావడంతో ఇరాన్‌ స్వయంగా ఈ ప్రకటన చేసింది. 

హోర్మూజ్ జలసంధిలో అమర్చిన మందు పాతరలను తొలగించి, అన్ని దేశాల నౌకలను అనుమతిస్తామని తెలిపింది. ఇరాన్‌ ఓడరేవులను దిగ్బందించిన అమెరికా యుద్ధ నౌకలు వెంటనే ఉపసంహరించుకుంటుందని, విదేశాలలో వివిధ బ్యాంకులలో స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన సుమారు రూ.55,000 కోట్లు విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించిందని ఇరాన్‌ ప్రకటనలో పేర్కొంది.

అమెరికా, ఇరాన్‌ పరస్పరం దాడులు నిలిపివేస్తాయని, ఇరాన్‌ అణు కార్యక్రమాలను నిలిపివేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. నేడో రేపో శాంతి ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు  సంతకాలు చేసి సంయుక్త ప్రకటన చేస్తే యుద్ధం సమాప్తం అయినట్లే.

అప్పుడు మళ్ళీ ఇరాన్‌ కూడా ఇది వరకులా భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు  చమురు అమ్ముకోవచ్చు. కనుక అధికారిక ప్రకటన వెలువడితే భారత్‌తో సహా అన్ని దేశాలకు ఉపశమనం లభిస్తుంది. 


Related Post