తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
Latest update of Telangana Municipal Elections
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో మధ్యాహ్నం 1.45 గంటల వరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రకారం మొత్తం 2581 వార్డులలో 1918 లెక్కింపు కొలిక్కి వచ్చింది. దాని ప్రకారం మూడు ప్రధాన పార్టీల ఆదిక్యతలు ఈవిధంగా ఉన్నాయి. కాంగ్రెస్:1026, బీఆర్ఎస్: 569, బిజేపి:174, ఇతరులు:182 వార్డులలో ఆధిక్యంలో ఉన్నాయి.
మొత్తం 7 కార్పోరేషన్లలో 414 డివిజన్లు ఉండగా వాటిలో ఇప్పటి వరకు 121 స్థానాలకు లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ 3, బిజేపి 1 కార్పోరేషన్‌లో ఆధిక్యంలో ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ 65 డివిజన్లు, బీఆర్ఎస్: 22, బిజేపి: 20, ఇతరులు: 14 డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నారు.
జనగామ మున్సిపాలిటీలో 30 సీట్లలో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్:13, సీపీఎం: 1, స్వతంత్ర అభ్యర్ధులు: 4 సీట్లు గెలుచుకోవడంతో హంగ్ ఏర్పడింది.