ఎఫ్-1 రేసింగ్ కేసులో సోమవారం విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు నోటీస్ పంపించడంతో, మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊహించినట్లే స్పందించారు. సోషల్ మీడియాలో సిఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.
“పదేళ్ళ క్రితం రెడ్ హ్యాండ్‌గా పట్టుబడిన రేవంత్ రెడ్డిపై ఇదే ఏసీబీ కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు నాపై కూడా కేసు పెట్టారు. ఇద్దరిపై కేసులునందున రేవంత్ రెడ్డికి నేను ఓ సవాలు చేస్తున్నాను. ఇద్దరం కోర్టులో న్యాయమూర్తి, మీడియా సమక్షంలో ‘లై డిటెక్టర్ టెస్ట్’ చేయించుకుందాము. ఎవరు అవినీతిపరులో తెలిపోతుంది. నేను టెస్టుకి సిద్దం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉందా?” అని కేటీఆర్ సవాల్ విసిరారు.
పరిపాలన చాతకాక ప్రజల దృష్టి మళ్లించేందుకుఈవిదంగా రోజుకో రకం డ్రామాలు ఆడుతున్నారు. ఓ వైపు మీ మంత్రులు, మరోవైపు కాంట్రాక్టర్లు కూడా మీది కమీషన్ల ప్రభుత్వమని చెపుతున్నా రేవంత్ రెడ్డి స్పందించడం లేదు. మీ దివాళాకోరుతనం వల్లనే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. దానిని మా ప్రభుత్వానికి ఆపాదించి అబద్దాలు చెపుతూ రాష్ట్ర ప్రజలను ఇంకెంత కాలం మభ్యపెడతారు?
దమ్ముంటే ‘లై డిటెక్టర్ టెస్టుకి వచ్చి నిజాయితీ నిరూపించుకోవాలి. మా హయంలో ఎఫ్-1 రేసింగ్ కోసం నిర్వహణ కంపెనీకి పంపిన రూ.44 కోట్లు వెనక్కు తెచ్చుకోలేక నాకు నోటీసులు పంపారు. నేను ఏ తప్పు చేయలేదు. కనుక సోమవారం తప్పకుండా విచారణకు హాజరవుతాను. విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలన్నీటికీ సమాధానాలు చెపుతాను,” అని కేటీఆర్ అన్నారు.
<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..<br><br>కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ…</p>— KTR (@KTRBRS) <a href="https://twitter.com/KTRBRS/status/1933495440122786275?ref_src=twsrc%5Etfw">June 13, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>