భారత్‌ జవాను పూర్ణమ్‌ సాహు సేఫ్ రిటర్న్!

May 14, 2025


img

పాక్‌ చేతికి చిక్కిన బీఎస్ఎఫ్ 182 వ బెటాలియన్‌కు చెందిన పూర్ణమ్ సాహు అనే భారత్‌ జవానుని పాక్‌ దళాలు ఈరోజు అటారీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారత్ అధికారులకు అప్పగించారు.

పూర్ణమ్ సాహు పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ వద్ద స్థానిక రైతులకు రక్షణగా గస్తీ కాస్తున్నప్పుడు, ఓ చెట్టు నీడలో నిలబడ్డాడు. అయితే అది పాక్‌ భూభాగంలో ఉందనే విషయం మరిచిపోయాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన పాక్‌ రెంజర్లు అతనిని అరెస్ట్‌ చేసి పై అధికారులకు అప్పగించారు.

అతనిని ఏప్రిల్ 23న అరెస్ట్‌ చేయగా ఆ తర్వాత భారత్‌-పాక్‌ మద్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో అతనిని విడిపించుకునేందుకు భారత్‌ అధికారులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.

కానీ ఇటీవల ఓ పాక్‌ రెంజరు రాజస్థాన్‌లో శ్రీ గంగా నగర్‌లోకి ప్రవేశించినపుడు భారత్‌ దళాలు బందించడంతో అతనిని విడిపించుకోవడం కోసం పూర్ణమ్ సాహుని విడిచిపెట్టక తప్పలేదు. పాక్‌ చేతికి చిక్కి ప్రాణాలతో తిరిగి రావడం అంటే మృత్యువుని జయించినట్లే! పూర్ణమ్ సాహు భార్య నిండు గర్భవతి.

భర్తని పాక్‌ దళాలు అరెస్ట్‌ చేశాయని తెలిసినప్పటి నుంచి ఆమె కన్నీరు మునీరుగా విలపిస్తూనే ఉంది. కానీ ఆమె నొసట సింధూరం చెరిగిపోకుండా పూర్ణమ్ సాహు సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చాడు. 


Related Post