కేసీఆర్‌ని ఎవరు కాపాడుతున్నారు?

June 22, 2025


img

ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వరం కేసులలో చిక్కుకున్న కేసీఆర్‌ని ఎవరు కాపాడుతున్నారు? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. కేసీఆర్‌, కేటీఆర్‌లని తమ ప్రభుత్వం అరెస్ట్‌ చేయనీయకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించిన సంగతి తెలిసిందే.

కానీ కేసీఆర్‌, కేటీఆర్‌లని కాంగ్రెస్‌ అధిష్టానమే కాపాడుతోందని బీజేపి ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌, కేటీఆర్‌లని ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కేసీఆర్‌ ఢిల్లీలో ఎవరికి మూటలు పంపాలో వారికి పంపిస్తూనే ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీ వస్తున్నా ఏనాడూ కాంగ్రెస్‌ అధిష్టానం ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వరం కేసు ఏమైందని గట్టిగా అడగటం లేదు.

ఏడాదిన్నరగా కమిటీలు, విచారణ అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నా కాంగ్రెస్‌ అధిష్టానం పట్టించుకోవడం లేదు. కనుక కేసీఆర్‌, కేటీఆర్‌లని కాంగ్రెస్ పార్టీయే కాపాడుతోంది. కాదంటే విచారణ ఎందుకు పూర్తిచేయలేదు?

కేసీఆర్‌, కేటీఆర్‌లపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఇంతవరకు ఒక్క కేసులో కూడా నోటీస్ ఎందుకు ఇవ్వలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల కానట్లయితే ఈ రెండు కేసులను సీబీఐకి అప్పగిస్తే అదే వారి సంగతి చూసుకుంటుంది కదా?” అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. 

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr">Congress is doing timepass in the name of inquiries. Since coming to power, not a single concrete step has been taken on corruption by KCR’s family. Telangana govt should hand over Kaleshwaram &amp; phone tapping probe to CBI - public has lost trust in Congress. <a href="https://t.co/nV8HxerUvj">pic.twitter.com/nV8HxerUvj</a></p>&mdash; Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) <a href="https://twitter.com/bandisanjay_bjp/status/1936725037148787020?ref_src=twsrc%5Etfw">June 22, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>     



Related Post