మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’తో హిట్ కొట్టబోతే ఎదురుదెబ్బ తిన్నారు. కానీ దాని నుంచి తేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. తాజాగా అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ పోటీ ప్రకటించారు.
దీనిలో పాల్గొనదలచిన దర్శకులు 10 నిమిషాలు నిడివిగల షార్ట్ ఫిల్మ్ తీసి +91 79979 70444 వాట్సప్ నంబరుకి పంపించాలని మంచు విష్ణు కోరారు. ఈ పోటీకి సంబంధించి వివరాలు కూడా ఇదే వాట్సప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.
మార్చి 19న తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజునాడు ఈ పోటీలో గెలిచిన విజేత పేరు ప్రకటిస్తామని చెప్పారు. విజేతకు తమ అవా ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూ.10 కోట్లు బడ్జెట్‌తో తీయబోయే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇస్తామని మంచు విష్ణు చెప్పారు.
కొత్త దర్శకుడితో చేయబోయే ఆ సినిమాలో మంచు విష్ణు నటిస్తారో లేదో చెప్పలేదు. కానీ మంచు విష్ణు కొత్త దర్శకుడుతో రూ.10 కోట్లు బడ్జెట్‌తో ఓ చిన్న సినిమా ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/emL1BFWp9PA?si=Q3BIHR7pjtIM9JJb" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>